భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టినా.. తూర్పుగోదావరిజిల్లాలోని శివారు ప్రాంతాలైన సఖినేటిపల్లి, మాలికిపురం మండలాల్లో వశిష్టా నదికి వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో అప్పనరామునిలంక, టెకిశెట్టిపాలెంలో వరదనీరు పోటెత్తింది. దీంతో లంకగ్రామాలైన పెదలంక, కొత్తలంక, రామరాజులంక బాడవ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రాజోలు మండలంలోని నున్నవారిబాడవ, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులు నీట మునిగాయి.. తెల్లవారుజామున నుంచి టెకిశెట్టిపాలెం కాజ్వేపై రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై స్థానిక అధికారులు ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో అక్కడి గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.