ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదలు తెచ్చిన కష్టం..ఒడ్డునే జీవనం - గోదావరి వరదలు2020

ఒంటి నిండా కప్పుకోవడానికి సరైన వస్త్రం ఉండదు. తలదాచుకునేందుకు గుడిసె కూడా లేదు. గాలి వీస్తే ఎగిరిపోయే గుడిసెలు వారివి. ఇలాంటి దీనస్థితిలో ఉన్న కుటుంబాలను గోదావరి వరద నానా ఇబ్బందులకు గురి చేస్తోంది.

due to godavari floods people loss their house and staying beside the shore
due to godavari floods people loss their house and staying beside the shore

By

Published : Aug 16, 2020, 4:04 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం వుడుమూడి గ్రామానికి ఎదురుగా ఉన్న వశిష్ట ఎడమ ఏటిగట్టు దిగువన.. గోదావరి ఒడ్డున నివాసముంటున్న నిరుపేదల కుటుంబాల పరిస్థితి గోదావరి వరదల కారణంగా దయనీయంగా మారింది. సుమారు 20 నిరుపేద కుటుంబాలు సంవత్సరాల తరబడి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. పక్షులు ఇతర జంతువులు వేటాడి బతుకు వెళ్లదీస్తారు. గోదావరి ఒడ్డున వేసుకున్న పూరి గుడిసెలు వరద నీటిలో మునిగి పోయాయి. దీంతో వారంతా ఏటి గట్టు మీదకు చేరి గుడిసెలు వేసుకుని వాటిపై టార్పన్లు కప్పుకుని తలదాచుకుంటున్నారు. అన్నం వండుకునేందుకు కూడా వీలులేని పరిస్థితి. చిన్న పిల్లలతో వారు పడుతున్న అవస్థలు దయనీయం. వరదలొచ్చినప్పుడల్లా తమ పరిస్థితి ఇదేనని... పట్టించుకునే నాథుడే లేడని గోడు వెలిబుచ్చుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details