తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోకి ఎవరూ రాకుండా ఆలయం చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని ప్రభుత్వం నిలుపుదల చేసింది. ప్రస్తుతం ఆలయంలో ప్రాకార మండపం పనులు జరిగిన నేపథ్యంలో చుట్టూ ప్రహరీ గోడలను తొలగించారు. చుట్టుపక్కల వారు ఆలయంలోకి స్వామి దర్శనం కోసం ప్రవేశించారు. గత శనివారం సుప్రభాత సేవకు పలువురు భక్తులు ఆలయంలోకి రావడం, దర్శనాలు చేసుకోవడంతో ఎనిమిది మంది ఆలయ సిబ్బందిని అధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆలయంలోకి ఎవరు ప్రవేశించకుండా ఆలయం చుట్టూ గేట్లను ఏర్పాటు చేశారు.
ఆలయంలోకి రాకుండా అడ్డుకట్టలు..! - east godavari temple closed latest news
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి భక్తులు ప్రవేశించకుండా కటుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
due to devoties coming ineast godavari dst vadapalli temple officers take measures