మూడో విడత రేషన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ తప్పనిసరి చేయడాన్ని చౌక దుకాణాల రేషన్ డీలర్లు తప్పుబట్టారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ చౌక దుకాణాల డీలర్లు కోరారు. రెండు విడతల నిత్యావసర పంపిణీ గ్రామ వాలంటీర్లు, కార్యదర్శుల సమక్షంలో జరిగిందని... మూడో విడత మాత్రం బయోమెట్రిక్ తప్పనిసరం చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. నంద్యాలలో ఇద్దరు డీలర్లు కరోనా బారిన పడ్డారని... వేలిముద్రల ద్వారా సరుకులు పంపిణీ చేస్తే మిగతా డీలర్లకు వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. వాలంటీర్లు, ఆశా కార్యకర్తల మాదిరిగినే రేషన్ డీలర్లకు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
'బయోమెట్రిక్ నిబంధనపై ప్రభుత్వం పునరాలోచించాలి'
రాష్ట్రంలో మూడో విడత రేషన్ పంపిణీ ఈ నెల 29 నుంచి మొదలుకానుంది. ఒక్కో కార్డుకు కిలో కందిపప్పు, కుటుంబ సభ్యుడికి 5 కిలోల బియ్యం చొప్పున ఉచితంగా అందించనున్నారు. అయితే రేషన్ దుకాణాలు, ప్రత్యేక కౌంటర్లలో కార్డుదారుడి వేలిముద్ర తీసుకుని నిత్యావసరాలను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించటంతో రేషన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ ఇదేం చర్యని అంటున్నారు.
due to corona ration dealers fear for biometrict in tarion shops at east godavari