ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: యానం రాకపోకలకు పాసులు జారీ

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలవర పెడుతోంది. ఈ ఎఫెక్ట్ యానంపై పడుతుందేమో అని అధికారులు భయపడుతున్నారు. ఈ మేరకు స్పందించిన జిల్లా అధికారులు యానాం వెళ్లే వారికి పాసులు జారీ చేస్తున్నారు.

due to corona Passes are issued to those traveling to Yanam from east godavari district
కరోనా ఎఫెక్ట్: యానం రాకపోకలకు పాసులు జారీ

By

Published : Jun 19, 2020, 4:34 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో పది రోజుల్లో గణనీయంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు... యానం అధికారులను కలవరపెడుతున్నాయి. సమీప ప్రాంతాల నుంచి రోజుకు 1000 నుంచి 1500 మంది ప్రజలు తమ అవసరాల కోసం యానం వెళ్తుంటారు. వీరిలో ఏ ఒక్కరు నుంచి అయినా కరోనా వస్తుందేమో అని యానాం అధికారులు భయపడుతున్నారు. ఈ మేరకు రాకపోకలు నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి ఉన్నతాధికారులు... డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనాను కోరారు. స్పందించిన కలెక్టర్ ముఖ్యమైన వారికి పాసులు జారీ చేసే ప్రక్రియను చేపట్టారు.

పాసులు జారీ ఇలా..

యానంలో నివాసం ఉంటూ... జిల్లాలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో పలు సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రమే... రానున్న మూడు నెలల కాలపరిమితికి గానూ పాసులు జారీ చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ రాధాకృష్ణ, సర్కిల్ ఇన్​స్పెక్టర్ శివ గణేష్, కోవిడ్ నోడల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు.

పాసులు పొందినవారు యానం నుంచి బయటకు వెళ్ళినప్పుడు.. తిరిగి వచ్చేటప్పుడు కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని డిప్యూటీ కలెక్టర్ ఆదేశించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 465 కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details