లాక్డౌన్ కారణంగా బాలింతలు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని పలు మండలాలకు చెందిన గర్భిణీలు, బాలింతలు వైద్యానికి.. సమీపంలోని యానాం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. లాక్డౌన్ కారణంగా ఉదయం తొమ్మిది గంటల తర్వాత వాహనాలను యానాంలోకి అనుమతించకపోవడం.. ప్రభుత్వం తల్లిబిడ్డ వాహనాలు రద్దు చేయటంతో.. వారంతా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వారం రోజులు కూడా నిండని బిడ్డలను ఒడిలో పెట్టుకొని.. ఆసుపత్రి బయట ఆటోల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
లాక్డౌన్ ప్రభావం: బాలింతలు, గర్భిణీలకు వైద్యం దూరం! - తూర్పుగోదావరిలో కరోనా ఎఫెక్ట్
అసలే ఎండాకాలం అందులోనూ లాక్డౌన్తో బాలింతలు, గర్భిణీలు వైద్యం కోసం అగచాట్లు పడుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
due to corona lockdown pregnant women facing problems at mummudivaram in eastgodavri