కరోనా లాక్డౌన్ కారణంగా ఎవరూ ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉండాలని దాతలు ముందుకు వస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన గాజింగం సత్తిబాబు భోజనాల పంపిణీ చేపట్టారు. గోకవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యాచకులు, వలస కూలీలు, నిరుపేదలు, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో సహా సుమారు 400 మందికి భోజనాన్ని పార్సిల్స్ రూపంలో అందిస్తున్నారు. లాక్డౌన్ ఉన్నంత వరకూ ఈ కార్యక్రమం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
దాతృత్వం.. మానవత్వం - గోకవరంలో కరోనా వార్తలు
కరోనా వేళ ఎంతో మంది హృదయంలో మానవత్వం పరిమళిస్తోంది. లాక్డౌన్ కారణంగా ఆకలితో బాధపడుతున్న ఎంతో మందికి దాతలు సహాయం అందిస్తున్నారు. వారి ఆకలిని తీరుస్తున్నారు.
![దాతృత్వం.. మానవత్వం due to corona lockdown Donors distributing food at gokavaram in eastgodavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6681833-718-6681833-1586158273320.jpg)
due to corona lockdown Donors distributing food at gokavaram in eastgodavari district