తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామానికి చెందిన మోటూరి వెంకటరమణ తన సొంత ఖర్చులతో.. గ్రామంలోని ప్రతి ఇంటికి కూరగాయలును ఉచితంగా పంపిణీ చేశారు. లాక్డౌన్లో భాగంగా ఇంటికే పరిమితం అయిన 500 కుటుంబాలకు సాయం చేశారు. రెండు కేజీలతో కూడిన కూరగాయలను ప్యాకింగ్ చేసి ఆటోలో పెట్టుకుని.. యువకుల సాయంతో ఇంటికి అందించారు.
500 కుటుంబాలకు దాత కూరగాయల వితరణ - కరోనా కారణంగా ఈతకోట గ్రామంలో కూరగాయల పంపిణీ
కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ని విధించడంతో.. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు తోచిన సహాయం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోనూ ఓ దాత తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
![500 కుటుంబాలకు దాత కూరగాయల వితరణ due to corona distribute vegetables at Itakota in eastgodavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6644807-95-6644807-1585913891034.jpg)
due to corona distribute vegetables at Itakota in eastgodavari district