తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ విధించారు. వ్యాపారులంతా ఈ నిబంధనలు పాటించాలని పంచాయతీ అధికారి హరినాథ్ బాబు స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంపచోడవరం వ్యాపారులతో మాట్లాడి లాక్ డౌన్‌కు సహకరించాలని హరినాథ్ కోరారు.
రంపచోడవరంలో కరోనా కలవరం.. లాక్డౌన్ విధించిన అధికారులు - తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ విధించారు. దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే తెరవాలని పంచాయతీ అధికారి హరినాథ్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Breaking News