తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదం వల్ల దుకాణాలు తెరిచి ఉంచే సమయంపై వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. రావులపాలెంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా దుకాణాలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచిఉంచాలని అధికారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు నిర్ణయించారు. ఈ నిర్ణయంపై 11వ తేదీన అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం దుకాణాలన్నీ మధ్యాహ్నం రెండు గంటలకు మూసేస్తున్నారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల మధ్య వివాదం...గందరగోళంలో దుకాణదారులు - రావులపాలెం వార్తలు
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం... దుకాణదారుల్ని గందరగోళానికి గురిచేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకే దుకాణాలు తెరవాలని అధికారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు నిర్ణయించి, ఆదేశాలిచ్చారు. వివాదం వల్ల కొందరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దుకాణదారులకు ఫోన్లు చేసి దుకాణాలను రాత్రి 7 గంటల వరకూ తెరుచుకోవచ్చని చెప్పడంతో... ఎవరి మాట వినాలో పాలుపోవట్లేదని వ్యాపారులు అంటున్నారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల మధ్య వివాదం...గందరగోళంలో దుకాణదారులు
ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల మధ్య నెలకొన్న వివాదంతో... కొంత మంది సభ్యులు వ్యాపారస్థులకు ఫోన్ చేసి దుకాణాలను మూసివేయాల్సిన అవసరంలేదని చెబుతున్నారు. దుకాణాలు రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని చెప్పడం వల్ల గందరగోళం నెలకొంది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో వివాదాలు ఏంటని వ్యాపారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :సీఎం జగన్కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ...ఎందుకంటే ?