తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం ఒక అపార్టుమెంటు వాసుల్ని భయాందోళనకు గురిచేసింది. దుబాయ్ నుంచి వారు వచ్చినప్పుడు ఎయిర్‌పోర్టులో చేసిన తనిఖీల్లో కరోనా వైరస్ సోకలేదని తేలింది. అయినా ఆ నలుగురు కుటుంబ సభ్యులనీ గృహనిర్బంధంలో ఉండాలని పోలీసులు సూచించారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా వారు బయట తిరుగుతుండటంపై స్థానికులు ఆందోళనకు గురై మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకొని ఆ నలుగుర్ని బొమ్మూరులో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు.
దుబాయ్ నుంచి వచ్చి... అందర్నీ భయపెట్టి... చివరికి! - దుబాయ్ నుంచి వచ్చిన కాకినాడ వాసులు క్వారంటైన్‌కు తరలింపు
దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం గృహ నిర్బంధంలో ఉండాలని పోలీసులు సూచించారు. అయినప్పటికీ వారంతా బయట తిరుగుతుండటంపై స్థానికులంతా భయపడ్డారు. పోలీసులకు సమాచారం అందించారు. చివరికి.. ఆ కుటుంబాన్ని క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.
దుబాయ్ నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించిన కాకినాడ పోలీసులు