'లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి' - dsp visit kottapet red zone area
ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని అమలాపురం డీఎస్పీ ప్రజలకు సూచించారు. కొత్తపేట రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన ఆయన... లాక్ డౌన్ నిబంధనల అమలు తీరుపై ఆరా తీశారు.

'లాక్డౌన్ నిబంధలు కచ్ఛితంగా పాటించాలి'
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట రెడ్ జోన్ ప్రాంతాన్ని అమలాపురం డీఎస్పీ మాసుం భాషా సందర్శించారు. ఈ ప్రాంతంలో అమలవుతున్న లాక్డౌన్ నిబంధనలపై ఆరా తీశారు. నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద మార్కింగ్ చేయించారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ.. సరకులు కొనుగోలు చేయాలని సూచించారు. కొత్తపేటలో ఉన్న రైతు బజార్‌ను ప్రభుత్వ పాఠశాలలో ఉన్న క్రీడా ప్రాంగణంలోకి మారుస్తున్నట్టు వెల్లడించారు. ఉదయం 9 గంటలలోపు నిత్యావసర సరకులను కొనుగోలు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు.