తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయినా చాలామందిలో జాగ్రత్తలు కానరావటం లేదు. ఈ జాబితాలో మందుబాబులు ముందుంటున్నారు.
మద్యం కోసం ఆత్రం... భౌతిక దూరానికి దూరం - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతునే ఉన్నాయి. ప్రజలు మాత్రం కనీస జాగ్రత్తలను విస్మరిస్తున్నారనే చెప్పాలి. మద్యం ప్రియులు మందు కోసం కరోనాని సైతం లెక్కచేయకుండా విచ్చలవిడిగా తిరుగుతూ గుంపులుగుంపులుగా చేరి మద్యం కోసం ఎగబడుతున్నారు.
drunkers not maintain social distance in east godavari dst konasima
ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలను అనుమతిస్తున్నారు. దీనివల్ల మందుబాబులు ఉదయం నుంచే మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా ఎగబడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Last Updated : Jul 18, 2020, 8:27 PM IST