తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రామారావుపేటలో ఓ వైన్ షాపు వద్ద క్యూలైన్లలో నిల్చున్న మందుబాబుల్ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రేమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంది. మద్యంప్రియులు తెల్లవారుజాము నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. కొవిడ్ నిబంధనల్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. వందల సంఖ్యలో రోజూ కేసులు పెరిగిపోతుంటే మందుబాబులు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిషా కోసం నిరీక్షణ... కరోనా ఉన్నా డోంట్ కేర్..! - east godavari dst taja news
తెల్లవారకముందే మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. కరోనా కేసులు వందల సంఖ్యలో వస్తున్నా... తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సీసా దక్కితే చాలని గంటలకొద్ది పడిగాపులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ మద్యం దుకాణం వద్ద మందుబాబులు ఇలా క్యూకట్టారు.
drunkers in east godavari dst kakinada not maintain social distance