మైక్రో (డ్రిప్) ఇరిగేషన్ ద్వారా పంటలు అధిక దిగుబడులు సాధించవచ్చునని ఏపీఎంఐపీ డీపీ వీరభద్రరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముడులంక, మడికి, బడుగువానిలంక, చొప్పెల్ల, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం మండలాల్లో ఏర్పాటు చేసిన మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో 4500 హెక్టార్లలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గత ఏడాది ప్రభుత్వ అనుమతులు పొందిన ఐదు కంపెనీల ద్వారా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ప్రస్తుతం పది కంపెనీల ద్వారా .. ప్రభుత్వం యాభై శాతం రాయితీతో రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేస్తుందనన్నారు. ఈ ఏడాది అన్ని అర్హతలు ఉండి మైక్రో ఇరిగేషన్ కొత్తగా వేసుకునే రైతులు... ఆయా గ్రామాల సచివాలయం అధికారులను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.