ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రానున్న రోజుల్లో ఇంటింటికీ కుళాయి వేసేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ తెలిపారు. తాళ్లరేపు మండలం ఇంజవరం గ్రామంలో పర్యటించి మంచినీటి కుళాయిలు ప్రారంభించారు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆ గ్రామస్థులు... ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన వారం రోజుల్లో కుళాయిలు ఏర్పాటు చేయాలని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. తమ గ్రామానికి మంచి నీరు వచ్చినందుకు అక్కడి మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
మంచినీటి కుళాయిని ప్రారంభించిన ఎమ్మెల్యే - injavaram village water problem solved latest news
ఇంజవరం గ్రామంలో మంచినీటి కుళాయిని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ ప్రారంభించారు. అలాగే రానున్న రోజుల్లో ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మంచినీళ్లు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇంజవరం గ్రామంలో మంచినీటి కుళాయిని ప్రారంభించిన ఎమ్మెల్యే