ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చుట్టూ నీళ్లున్నా... వారికి తాగునీరు లేదు - east godavari drinking water problems

మూడు వైపులా గోదావరి నది... మరోవైపు సముద్రం... ఇలాంటి కోనసీమ ప్రాంతంలో ప్రజలు గుక్కెడు మంచినీళ్ల కోసం నానా అవస్థలు పడుతున్నారు. ప్రత్యేకించి సముద్ర తీరప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండల్లో వారు నీటికోసం పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు.

drinking water problems in east godavari district
తాగునీటి కోసం తూర్పుగోదావరి వాసుల ఇక్కట్లు

By

Published : May 27, 2020, 4:58 PM IST

Updated : May 27, 2020, 7:09 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని సఖినేటిపల్లి మండలం... అంతర్వేది, పల్లిపాలెం మొదలుకొని ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకు సుమారు 60 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు సముద్రతీరం వెంట ఉండటంతో భూగర్భ జలాలు ఉప్పు కయ్యలుగా ఉంటాయి. ఈ నీరు తాగేందుకు, స్నానాలు చేసేందుకు పనికిరావు. రక్షిత మంచినీటి పథకాలు ఉన్నా... వేసవి కావడంతో వాటి ద్వారా పూర్తిస్థాయిలో ప్రజలకు తాగునీరు అందటం లేదు. అధికారులు అరకొరగా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నా... అవి కూడా సరిగ్గా అందడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

తాగునీటి కోసం తూర్పుగోదావరి వాసుల ఇక్కట్లు

ఇళ్ల ముందు ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుని... తాగునీటి ట్యాంకర్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా తమ కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారు.

Last Updated : May 27, 2020, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details