తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లోని తీర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మండల కేంద్రాలలోనూ ప్రజలు తాగునీటి కొరకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. కనీసం జనాభా ప్రాతిపదికన అయినా కుళాయిలు ఏర్పాటు చేయాలని.. ప్రతి కుటుంబానికీ సరిపడేంత నీటినీ సరఫరా చేయాలనీ అధికారులను ప్రజలు వేడుకొంటున్నారు. ఎన్నికల సమయంలో... అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో పనైపోతుందని నేతలు చెప్పినా... ఏడాది దాటినా ఏ మార్పులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి... తమ తాగునీటి సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.
ముమ్మిడివరం... ఇక్కడి ప్రజలకేది తాగునీటి సౌకర్యం..? - east godavari district latest news
ప్రజలు ఆరోగ్య వంతులుగా ఉండటం అనేది వారు రోజూతాగే మంచినీటిపైనే ఆధారపడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సర్కారు సరఫరా చేసే కుళాయి నీరే జీవామృతం. అయితే ఆ కుళాయి నీరు కూడా సరిగా రావడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఒకప్పుడు వేసవిలో మాత్రమే తలెత్తే తాగునీటి సమస్య... ఇప్పుడు ఏడాది పొడవునా గ్రామాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముమ్మిడివరం... ఇక్కడి ప్రజలకేది తాగునీటి సౌకర్యం..?