తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని అంబాజీపేట, పుల్లేటికుర్రులలో వరస చోరీలు జరిగాయి. దొంగలు దుకాణాల తలుపులు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న నాలుగు రహదారుల కూడలిలోనే నాలుగు దుకాణాల్లో చోరీలు జరగడం గమనార్హం. చౌరస్తాలోని సీసీ కెమెరాలు పని చేయడం లేదని.. భారీగా సొత్తు దొంగిలించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
తలుపులు పగులగొట్టి నాలుగు దుకాణాల్లో చోరీ - east godavari crime news
తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేట, పుల్లేటికుర్రు గ్రామాల్లోని పలు దుకాణాల్లో దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంబాజీపేట, పుల్లేటికుర్రులలో వరస చోరీలు