ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ గ్రామానికి ఎవరూ వెళ్లొద్దు' - గొల్లమామిడాడ వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లలమామిడాడలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడం చుట్టు పక్కల పల్లెల్లో కలకలం స్పష్టిస్తోంది. అతని కేసుకు అనుబంధంగా చుట్టు పక్కల గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూ భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి ఎవరూ వెళ్లొద్దని పలు ఊర్లలో దండోరా వేయించారు అధికారులు.

'don't go to that village'
'don't go to that village'

By

Published : May 27, 2020, 7:35 PM IST

'ఆ గ్రామానికి ఎవరూ వెళ్లొద్దు'
తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం గొల్లలమామిడాడలో ఇటీవల కరోనా పాజిటివ్ లక్షణాలతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆ మృతుడి కేసుకు అనుబంధంగా జిల్లాలోని పెద్దపూడి, బిక్కవోలుతో పాటు పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూ అలజడి సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గొల్లలమామిడాడకి వెళ్లవద్దని, ఆ గ్రామం నుంచి ఎవరు వచ్చినా గ్రామవాలంటీర్లకు తెలపాలంటూ అనపర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దండోరా వేయించారు. కొందరు యువకులు ఆ దండోరాను చిత్రీకరించి సామాాజిక మాధ్యమాల్లో పెట్టటంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details