రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ... పలువురు దాతలు వైరస్ కట్టడికి విరాళాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన వైద్యులు, వ్యాపారులు రూ. 14 లక్షల విరాళాలు అందించారు. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ఆ చెక్కులను అందించారు. ప్రభుత్వానికి అండగా నిలిచిన వారందరినీ ఎమ్మెల్యే అభినందించారు.
సీఎం సహాయనిధికి తుని వైద్యుల విరాళం రూ. 14 లక్షలు - తునిలో లాక్డౌన్
కరోనా కట్టడికి స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ముందుకు వస్తూ ఉదారత చాటుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన పలువురు వైద్యులు, వ్యాపారులు రూ. 14 లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు.
సీఎం సహాయనిధికి తుని వైద్యుల 14 లక్షల విరాళాలు