ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరుతపులి కూనపై.. కుక్కల దాడి.. చివరికి..! - Dogs attacking a leopard cub in the Pandirimamidi kota

పులి బలహీనపడితే కుక్క కూడా తొక జాడిస్తుందన్న తీరుగా... ఓ చిరుతపులి పిల్లపై శునకాలు దాడి చేశాయి. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం పందిరిమామిడి కోటలో ఈ ఘటన జరిగింది. దారితప్పి వనం నుంచి జనంలోకి వచ్చిన ఆ పులికూనను గ్రామసింహలు వెంటాడాయి.

Dogs attacking
చిరుతపులి కూనపై దాడి చేసిన కుక్కలు

By

Published : Feb 11, 2021, 5:46 PM IST

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని గిరిజన గ్రామమైన పందిరిమామిడి కోటలోకి ఓ చిరుతపులి పిల్ల.. దారితప్పి జనావాసాల మధ్యకు వచ్చింది. ఇది గమనించి స్థానికంగా ఉండే కొన్ని కుక్కలు పెద్దగా అరుస్తూ.. పులి కూనపై దాడి చేశాయి.

వెంటనే తెరుకున్న అక్కడి గిరిజనులు పులిపిల్లను.. వాటి నుంచి విడిపించారు. కాపాడారు. భద్రపరిచారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు ఆ సమాచారాన్ని అందించారు. అలాగే.. పులికూనకు ఆహరంగా ఓ కోడిని వేశారు.

ABOUT THE AUTHOR

...view details