తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరులోని ఏపీ టిడ్కో గృహ సముదాయాల్లోని క్వారంటైన్ గదుల్లో కరోనా అనుమానితులు కొందరు చికిత్స పొందుతున్నారు. ఆ గదుల్లోకి వెళ్లి శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు భయపడుతున్నారు. మరోపక్క రెవెన్యూ సిబ్బంది ఆహార పొట్లాలను తెచ్చి బయట ఉంచి వెళ్తున్నారు. వాటిని వైద్య సిబ్బందే తీసుకెళ్లి పంపిణీ చేయాల్సి వస్తోంది. వారికి పైనుంచి కింది దాకా ధరించే పూర్తిస్థాయి రక్షణ దుస్తులు, సరైన మాస్కులు, పాదరక్షలూ లేవు. గదులను శుభ్రం చేసేందుకు, ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలని వీరు కోరుతున్నారు.
నాడి పట్టేదీ వారే... బువ్వ పెట్టేదీ వారే..! - east godavari doctors latest news
కరోనా భయపెడుతున్న వేళ వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అమోఘం. వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగుతూ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. కొన్ని చోట్ల చికిత్సలతో పాటు ఇతరత్రా సేవల నిర్వహణనూ చేపట్టాల్సి వస్తోంది.
కరోనా అనుమానితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది