తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వైద్యులు రూ.3.35లక్షలను సీఎం సహాయనిధికి అందించారు. చెక్కు రూపంలో ఈ మొత్తాన్ని స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి అందజేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనపర్తి శాఖ సభ్యులు రూ.2.10లక్షలు, ఇతరులు రూ.1.25లక్షలను అందించారు. వైద్యపరంగా ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చిన డాక్టర్లను ఎమ్మెల్యే అభినందించారు. దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహాయం అందించాలని కోరారు.
సీఎం సహాయనిధికి రూ.3.35లక్షలు అందజేసిన వైద్యులు - anaparthi mla
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తమవంతు సహాయం అందించారు వైద్యులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన డాక్టర్లు రూ.3.35లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.
సీఎం సహాయనిధికి రూ.3.35లక్షలు అందజేసిన వైద్యులు