తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ కార్యాలయాన్ని... కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. గ్రామంలో మరిన్ని సేవలు గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థ ద్వారానే అందుతాయన్నారు. రాజానగరం నియోజకవర్గంలో 9 నూతన గ్రామ సచివాలయాలు వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రారంభించారు. మరో 15 సచివాలయాలు రాజానగరం నియోజకవర్గంలో త్వరలోనే ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు కూడా గ్రామ సచివాలయం వాలంటరీ వ్యవస్థ నుంచే ప్రారంభం అవుతాయని అన్నారు.
దివాన్ చెరువులో నూతన గ్రామ సచివాలయం ప్రారంభం - దివాన్ చెరువులో కొత్త సచివాలయం
తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు.
![దివాన్ చెరువులో నూతన గ్రామ సచివాలయం ప్రారంభం diwancheruvu new sachivalayam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7335313-604-7335313-1590377189961.jpg)
దివాన్ చెరువులో నూతన గ్రామ సచివాలయ కార్యాలయం