ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాడి రైతులు.. పథకాలు వినియోగించుకోవాలి' - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

దివాన్​ చెరువు గ్రామ సచివాలయంలో పాడి రైతులకు అధికారులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.

divan cheruvu sachivalayam employees meeting with farmer
రైతులతో సమావేశమైన దివాన్​ చెరువు సచివాలయ అధికారులు

By

Published : Sep 30, 2020, 12:29 AM IST

రాజానగరం మండలం దివాన్​ చెరువు గ్రామ సచివాలయంలో పాడి రైతులకు సమావేశం నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం వారు అందించే పశువుల దానాలు, పశు నష్ట పరిహారం, ఉచిత ఇన్సూరెన్స్​, లోన్ సౌకర్యం, కిసాన్ క్రెడిట్ కార్డు మొదలైనవి తెలియజేశారు. రైతులు రోడ్లపై ఆవులను వదిలి వెళ్తున్నారని... దాని వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇకపై ఆవులను రోడ్లపై వదిలితే రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, పంచాయతీ అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్తిరాజు, గ్రామ పశు సంవర్ధక శాఖ గణేష్​ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details