ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తూర్పు ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి' - రంపచోడవరం జిల్లా సాధన సమితి కమిటీ

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో జిల్లా ఏర్పాటుకు సాధన సమితి కమిటీని ఏర్పాటుచేశారు. తూర్పు ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కమిటీలోని సభ్యులు డిమాండ్ చేశారు.

district sadhana samithi committee at rampachodavaram
రంపచోడవరం జిల్లా సాధన సమితి కమిటీ

By

Published : Sep 2, 2020, 1:58 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో జిల్లా ఏర్పాటుకు సాధన సమితి కమిటీని ఏర్పాటుచేశారు. తూర్పు ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాల ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ... మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పాటుకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. అరకు జిల్లాను చేస్తే రంపచోడవరం నియోజకవర్గం నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు. గిరిజనుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ కమిటీలో కన్వీనర్​గా బాలు అక్కిస, కో కన్వీనర్ గా సీతంసెట్టి రత్తిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా కూర జయరాజు, నూతక్కి పార్వతీశం, నిరంజనీదేవిని ఎన్నుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details