ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా అభివృద్ధి పనులు - Panchayat Secretaries latest news update

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులతో జిల్లా పంచాయతీ అధికారి ఆర్. విక్టర్ సమావేశం నిర్వహించారు. అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలోని ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

District Panchayat Officer
పంచాయతీ కార్యదర్శులతో జిల్లా పంచాయతీ అధికారి సమావేశం

By

Published : Oct 21, 2020, 11:09 PM IST


రహదారులు, డ్రెయిన్ లపై ఉన్న ఆక్రమణలను పంచాయతీ అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చి తొలగించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆర్. విక్టర్ సిబ్బందిని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో ప్రత్యేక అభివృద్ధి పనులు చేయాలని స్పష్టం చేశారు.

అవసరమైన చోట్ల అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించడం, డ్రైన్ లను శుభ్రపరచడం చేయాలన్నారు. గ్రామాల్లో ఎవరికైనా జ్వరాలు వస్తే ఆర్ఎంపీ డాక్టర్ లను సంప్రదించకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి:

సుద్ద గెడ్డ వాగులో చిక్కుకున్న కారు..రక్షించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details