తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు అయిన రావులపాలెం మండలం గోపాలపురం వద్ద వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఉచిత భోజన సదుపాయం కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. ఇతర జిల్లాల నుంచి ఈ జిల్లా మీదుగా వెళ్లే వలస కార్మికుల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రతిరోజు భోజన సదుపాయాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
వలస కార్మికులకు వసతి, భోజనం.. పరిశీలించిన కలెక్టర్ - District Collector Muralidhar Reddy inspected the accommodation and dining facilities set up for migrant workers.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వసతి, భోజన సదుపాయాన్ని పరిశీలించారు.
వలస కార్మికులకు వసతి,భోజనం.. పరిశీలించిన కలెక్టర్