ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండపోడు సాగుదారులకు పట్టాలు పంపిణీ - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలంలో గిరిజనులను పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు పంపిణీ చేశారు. కొండపోడు సాగు చేస్తూ ఎన్నో ఏళ్లుగా పట్టాలు కోసం ఎదురు చూస్తున్న 2200 మందికి పట్టాలు మంజూరయ్యాయి.

Distribution of pattadar passbook at addategala
కొండపోడు సాగు భూములకు పట్టాలు పంపిణీ

By

Published : Nov 24, 2020, 7:12 PM IST

గిరిజనుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు. కొండపోడు సాగుచేస్తున్న గిరిజనులకు డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబుతో కలిసి అడ్డతీగల మండలంలో పట్టాదారు పాసు పుస్తకాలు(పట్టాలు) పంపిణీ చేశారు. గిరిజనులందరికీ భూమి ఉండాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని ఆమె తెలిపారు. మండలంలో 2200 మందికి కొండపోడు భూములకు సంబంధించి పట్టాలు మంజూరు అయ్యాయి. ఇవాళ 360 మంది లబ్ధిదారులకు హక్కుదారుల పాసు పుస్తకాలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details