కాకినాడలో వంద రూపాయలకే పండ్ల కిట్ - Distribution of fruit kit at kakinada
లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో ప్రజలకు పోషకాహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు. వంద రూపాయలకే వివిధ రకాల పండ్ల కిట్‌ను అందించే కార్యక్రమాన్ని ఆయన కాకినాడలో ప్రారంభించారు.
![కాకినాడలో వంద రూపాయలకే పండ్ల కిట్ Distribution of fruit kit for one hundred rupees at kakinada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6883661-376-6883661-1587476476970.jpg)
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉద్యానశాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో వంద రూపాయలకే వివిధ రకాల పండ్ల కిట్‌ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కొవిడ్ ప్రత్యేకాధికారి కాంతిలాల్‌దండే, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. లాక్డౌన్ కారణంగా అరటి, ఇతర పండ్ల రైతులు అమ్మకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని... ఈ కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. జిల్లాలో మంగళవారం మాస్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ చేతుల మీదుగా మాస్కులను పంపిణీ చేశారు.