తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న సుమారు 80 మంది పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎస్.ఎల్.టి. కేబుల్ ఎం.ఎస్.ఓ దూడల శ్రీనివాస్ వారికి సరుకులు అందజేశారు. కరోనా వైరస్ నియంత్రణలో మీడియా మిత్రులు కూడా భాగస్వామ్యం అవుతున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. భౌతిక దూరం పాటించటం ద్వారానే ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చన్నారు. భౌతిక దూరంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.
పాత్రికేయులకు నిత్యావసర వస్తువుల పంపిణీ - పాత్రికేయులకు నిత్యవసర వస్తువుల పంపిణీ
కరోనాపై పోరులో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పాత్రికేయులకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఎస్.ఎల్.టి. కేబుల్ ఎం.ఎస్.ఓ దూడల శ్రీనివాస్ వారికి సరుకులు అందజేశారు.

పాత్రికేయులకు నిత్యవసర వస్తువుల పంపిణీ
TAGGED:
Distribution