అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం... పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టామని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య అన్నారు. రాజవొమ్మంగి మండలంలోని అమీనాబాద్, మారేడుబాక, వనకరాయి తదితర గ్రామాల్లో వారు పర్యటించారు.
'అర్హులైన గిరిజనులందరికీ పట్టాలు పంపిణీ చేస్తాం'
అర్హులైన గిరిజనులందరికీ పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఆదిత్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రంపచోడవరం సబ్ కలెక్టర్ పాల్గొన్నారు.
గిరిజనుల నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు
ఈ సందర్భంగా ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చి వారి జీవనోపాధిని మెరుగు పరుస్తామని ప్రవీణ్ ఆదిత్య అన్నారు. పట్టాల పంపిణీకి ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని.. అక్టోబర్ 2న గాంధీ జయంతి పురస్కరించుకుని పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఇదీచదవండి.