రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం - రాజమహేంద్రవరంలో సీఎం జగన్ పర్యటన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 'దిశ' చట్టంపై నిర్వహించిన కార్యశాలలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దీనికి పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది హాజరయ్యారు. 'దిశ' చట్టానికి సంబంధించిన ప్రత్యేక యాప్ సీఎం ఆవిష్కరించారు.
రాజమహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం