తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో కరోనా కారణంగా మార్చి 20 నుంచి దర్శనాలతో పాటు అన్ని సేవలు ఆపేశారు. ఇటీవల భక్తులను స్వామి దర్శనానికి అనుమతించి వివిధ సేవలను తిరిగి ప్రారంభించారు. అయితే సహస్ర దీపాలంకరణ సేవపై దృష్టి సారించలేదు. ఈ విషయంలో వైదిక బృందం, అధికారుల మధ్య భిన్న వాదనలు ఉన్నట్లు సమాచారం. వారం లేదా పది రోజులకు ఒకసారైనా సేవ నిర్వహించాలని చర్చిస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు.
అన్నవరంలో సహస్ర దీపాలంకరణ సేవ పునః ప్రారంభంపై చర్చలు - annavaram temple news
కరోనా కారణంగా మూతపడిన ఆలయాలు దర్శనాలకు అనుమతించాయి. కానీ మునుపటిలా అన్నీ కార్యక్రమాలు నిర్వహించట్లేదు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవ పునఃప్రారంభించే విషయంలో మీమాంస నెలకొంది.
సహస్ర దీపాలంకరణ సేవ పాతచిత్రం
తిరుపతిలో మాదిరిగా అన్నవరంలో సహస్ర దీపాలంకరణ సేవను 2017లో ప్రారంభించారు. అప్పటి ధర్మకర్తల మండలి సభ్యుడు మట్టే సత్య ప్రసాద్ 1058 దీపాలు వెలిగేలా ప్రత్యేకంగా మందిరాన్ని, మండపాన్ని నిర్మించారు. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు తూర్పు రాజగోపురం వద్ద మందిరంలో సేవ నిర్వహించేవారు.
ఇదీ చదవండి: వరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ