ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిలిచిన వరద నీరు... దుర్వాసనతో గ్రామస్థుల ఇక్కట్లు - తూర్పుగోదావరి కోనసీమలో నిలిచిన వర్షపు నీరుతో దుర్వాసన

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని 74లంక గ్రామాలు వరదల కారణంగా నీట మునిగాయి. ముంపు గ్రామాల్లోని పల్లుపు ప్రాంతాల్లో పంటల్లో వరద నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు నిలిచిపోయిన నీటిని తొలగించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

dirty smell is raised due to stagnant flood water in konaseema at east godavari
తూర్పుగోదావరి కోనసీమలో నిలిచిన వర్షపు నీరుతో దుర్వాసన

By

Published : Aug 28, 2020, 12:10 PM IST

వరదలతో కోనసీమ లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన గోదావరి ఉద్ధృతి వరదలు పూర్తిగా తగ్గినప్పటికీ గ్రామాల్లో బాధలు తప్పలేదు. లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. ఉద్యాన పంటల్లో నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. కోనసీమలో 74 లంక గ్రామాలు వరదల్లో మునిగాయి. ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని అధికారులు తొలగించే ఏర్పాట్లు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details