ఐదు వందల బూరెలతో.. ఎమ్మెల్యేకు తులాభారం - different Tulabara to the MLA
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దంపతులు తమ మొక్కును వినూత్నంగా తీర్చుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి 500 బూరెలతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు.
తులాభారం
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన చిర్ల సత్తిరెడ్డి, పద్మావతి దంపతులు వినూత్నంగా మొక్కును చెల్లించుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, సూర్యనారాయణ రెడ్డి అనపర్తి ఎమ్మెల్యేగా గెలుపొందాలని వీరు అనపర్తి గ్రామదేవత వీరుళ్లమ్మకు గతంలో మొక్కుకున్నారు. తమ కోరిక నెరవేరినందున ఇవాళ వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సుమారు 500 బూరెలతో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి తులాభారం వేసి తమ మొక్కును తీర్చుకున్నారు.