తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం - రాజమహేంద్రవరం మార్గంలో.. సూరంపాలెం ఆదిత్య కళాశాల సమీపంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. అంబులెన్సుకి దారి ఇచ్చే క్రమంలో అదుపుతప్పి ట్యాంకర్ బోల్తా పడింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు.
లారీ బోల్తా పడిన కారణంగా... కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ట్యాంకర్ రాజమహేంద్రవరం నుంచి పెద్దాపురం వైపు వెళ్తున్నట్లు గండేపల్లి పోలీసులు తెలిపారు. ట్యాంకర్లో 15 వేల లీటర్ల డీజిల్ ఉంది. చమురు నేలపై పోతున్న కారణంగా.. పోలీసులు ఇసుకను ఆ ప్రాంతంలో వేశారు. క్రేన్ సహకారంతో ట్యాంకర్ ని తొలగించి ట్రాఫిక్ నియంత్రించారు.