ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనిశా కస్టడీకి.. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర - ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వార్తలు

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడ అనిశా కార్యాలయానికి తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను తరలించారు. ధూళిపాళ్లను 4 రోజులపాటు అనిశా అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సంగం డెయిరీ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసు నమోదు చేసింది.

Dhulipala Narendra
Dhulipala Narendra

By

Published : May 1, 2021, 10:31 AM IST

Updated : May 1, 2021, 5:46 PM IST

అనిశా కస్టడీలోకి ధూళిపాళ్ల నరేంద్ర

సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టై రిమాండ్‌లో ఉన్న తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను.. అవినీతి నిరోధక శాఖ.. కస్టడీలోకి తీసుకుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆయన్ను విజయవాడలోని అనిశా కార్యాలయానికి తరలించారు. ధూళిపాళ్లతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను కార్యాలయానికి తీసుకువచ్చారు. వీరిని ఈ నెల 4 వరకు విచారించేందుకు అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది.

తండ్రిని చూసేందుకు..

జైలు వద్ద నరేంద్రను చూసి.. ఆయన కుమార్తె కన్నీరు మున్నీరైంది. కారు అద్దం తీయాలని పోలీసులను బతిమలాడింది. తండ్రిని తీసుకెళ్తున్న కారు వెంట ఆమె ఆతృతగా బయలుదేరి వెళ్లింది. అనంతరం.. విజయవాడ అనిశా కార్యాలయానికి ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆయన్ను చూసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ధూళిపాళ్ల సతీమణి జ్యోతిర్మయి, తల్లి అధికారులను కోరారు. తన భర్తను ఇరికించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని జ్యోతిర్మయి కన్నీరు పెట్టుకున్నారు.

Last Updated : May 1, 2021, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details