ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ఏఐవైఎఫ్ అధ్వర్యంలో ధర్నా - eastgodavari newsupdates
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తోందని...అఖిల భారత యువజన సమాఖ్య ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. విభజన హామీలు వెంటనే అమలు చేయాలని...వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వాసితులకు పరిహారం నిధులు రూ.55వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని...విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.