ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చెత్త సేకరణకు యూజర్ చార్జీల వసూలు ఉపసంహరించండి'

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చెత్త సేకరణకు యూజర్ చార్జీలను వసూలు చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

Dharna to withdraw user charges for garbage collection
చెత్త సేకరణకు యూజర్ చార్జీల వసూలు ఉపసంహరించుకోవాలని ధర్నా

By

Published : Oct 5, 2020, 7:13 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలను వసూలు చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేశారు.

ఇప్పటికే ప్రజలు అనేక రకాల పన్నులు చెల్లిస్తున్నారని...చెత్త సేకరణకు చార్జీలు వసూలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. చెత్తసేకరణ బాధ్యత కార్పొరేషన్‌దే అన్నారు. యూజన్‌ చార్జీల వసూలు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

తగ్గుతున్న పులస లభ్యత... కారణాల కోసం అన్వేషణ!

ABOUT THE AUTHOR

...view details