పార్టీ నాయకులను, ఇటు అధికారులను సమన్వయపర్చుకుంటూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను ఇంఛార్జ్ మంత్రిగా అమలు చేస్తానని... ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ భరోసా ఇచ్చారు. గోదావరి వరదలు, కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు అన్ని అవసరాలను ప్రభుత్వం తీరుస్తుందని ధర్మాన అన్నారు.
'ఈ జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా నియమించడం ఆనందంగా ఉంది' - ధర్మాన కృష్ణదాస్ తాజా వార్తలు
సమర్ధవంతమైన నాయకుడు అధికారంలోకి వస్తే అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మూడు నెలల పాలనలో రుజువైందని... ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో చెప్పినట్లుగానే నవరాత్నాలతో పాటు ఇతర పథకాలను అమలు చేశారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
బీసీ సంక్షేమ శాఖమంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ... కరోనా, వరదలు తూర్పుగోదావరి జిల్లాపై పడ్డాయని... వీటిని ఎదుర్కొవడానికి అధికారులు ప్రణాళిక ప్రకారం శ్రమిస్తున్నట్లు తెలిపారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇదీ చదవండీ... మరింత క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాలు: వాతావరణ శాఖ