ధర్మాడి సత్యం బృందం ప్రయత్నం ఫలించింది. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో.. సెప్టెంబర్ 15 న మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీశారు. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటును బయటికి తెచ్చారు.
ప్రమాదం.. అనంతరం...
14:27 October 22
ధర్మాడి సత్యం బృందం ప్రయత్నం ఫలించింది. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో.. సెప్టెంబర్ 15 న మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీశారు. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటును బయటికి తెచ్చారు.
ప్రమాదం.. అనంతరం...
గత నెల 15న పర్యాటకులతో విహారంలో ఉన్న రాయల్ వశిష్ట బోటు.. హఠాత్తుగా ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బోటులో పర్యటుకులు, సిబ్బంది కలిపి 77 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో.. పరిసరాల్లో ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. బోటులో ఉన్న వారిలో కొందరిని కాపాడారు. మరోవైపు.. బోటులో ఉన్న లైఫ్ జాకెట్ల సాయంతో మరికొందరు ప్రాణాలు కాపాడుకున్నారు. ఇలా.. 26 మంది ప్రమాదం బారి నుంచి బయటపడగా.. ఇప్పటివరకు 39 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మరో 12 మంది గల్లంతయ్యారు. బోటును పూర్తిగా ఒడ్డుకు తీసుకువచ్చాక.. ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సహాయ చర్యలకు వర్షం ఆటంకం
ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయ చర్యలు కొనసాగుతున్నా... కొన్ని రోజులపాటు భారీ వర్షాలు, నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉన్న కారణంగా ఆటంకాలు ఎదురయ్యాయి. 3 రోజుల క్రితం నీటి మట్టం తగ్గిన కారణంగా.. మరింత విస్తృతంగా అధికారులు బోటు వెలికితీత ప్రయత్నాలు చేశారు. ధర్మాడి సత్యం బృందం నేతృత్వంలో గజ ఈతగాళ్లు నది లోనికి వెళ్లారు. బోటు ఉన్న చోటును పరిశీలించారు. లంగరు వేసి బోటును బయటకు తీసే ప్రయత్నం చేయగా.. నిన్న డ్రైవర్ క్యాబిన్ బయటకొచ్చింది. ఇవాళ మరోసారి తీసుకున్న చర్యలతో.. బోటును బయటికి తీసుకురావడంలో అంతా విజయం సాధించారు.