గోదావరిలో మునిగిన పర్యటక బోటును తన బృందంతో శ్రమించి ఒడ్డుకు చేర్చిన ధర్మాడి సత్యాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సన్మానించారు. రూ. 20 లక్షల చెక్కు అందించారు. బోటు వెలికి తీసేందుకు ధర్మాడి సత్యానికి చెందిన బాలాజీ మెరైన్ సంస్థతో ప్రభుత్వం 22 లక్షల 72వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా 2 లక్షల 70 వేలు చెల్లించింది. ఈ సంస్థకు చెందిన 25మంది 8 రోజులు శ్రమించి నదీ గర్భం నుంచి బోటు వెలికి తీశారు.
"బోటు బయటకు తీసిన ధర్మాడి సత్యానికి కలెక్టర్ సన్మానం" - Dharmadi sathyam taken out of the boat
గోదావరిలో మునిగిన పర్యటక బోటును తన బృందంతో శ్రమించి ఒడ్డుకు చేర్చిన ధర్మాడి సత్యాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సన్మానించారు.
గోదావరిలో బోటు వెలికితీసిన ధర్మాడి సత్యంకు సన్మానం