ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్వేది ఘటనపై దర్యాప్తు నివేదిక సీబీఐకి అప్పగిస్తాం: డీజీపీ - అంతర్వేది రథం దగ్ధం వార్తలు

అంతర్వేది ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఇప్పటికే ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామన్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో రథం దగ్ధం కావడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారని తెలిపారు.

dgp-sawang-on-antharvedhi-chariot-fire
dgp-sawang-on-antharvedhi-chariot-fire

By

Published : Sep 13, 2020, 7:48 PM IST

అంతర్వేది ఘటన కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించిందని.. తాము చేసిన దర్యాప్తు నివేదికను సీబీఐకి అప్పగిస్తామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి వాటన్నింటిని క్రోడీకరించి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ సంఘటనతో రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయల వద్ద భద్రతను పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం అంతర్వేదిలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. ఇంటెలిజెన్స్ అలెర్ట్స్ ఏమీ లేవన్న డీజీపీ.. అందరూ దర్యాప్తునకు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details