7 శనివారాలు నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వస్తుంటారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులు భారీ ఎత్తున తరలి రావటంతో స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. అన్న సమారాధన కార్యక్రమాన్ని దేవాదాయశాఖ అధికారులు నిర్వహించారు.
కోనసీమ తిరుపతికి పెరిగిన భక్తుల తాకిడి - atreyapuram
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

కోనసీమ తిరుపతికి పెరిగిన భక్తుల తాకిడి