తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావటంతో తీవ్ర రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే భక్తులు వ్రతాలు, దర్శనాలు చేసుకుంటున్నారు. ఇవాళ అధిక సంఖ్యలో 5,883 వ్రతాలు జరిగాయి. వ్రతాల టికెట్లు, ప్రసాద విక్రయాల ద్వారా 45లక్షల 60 వేల రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి కొందరు భక్తులు 2లక్షల 42 వేల రూపాయల విరాళాలు అందించారు.
వరుస సెలవులు.. అన్నవరానికి పోటెత్తిన భక్తులు - east godavari
వరుస సెలవుల నేపథ్యంలో అన్నవరంలో భక్తుల రద్దీ నెలకొంది. పెద్దసంఖ్యలో తరలివచ్చి వ్రతాలు, దర్శనాలు చేసుకుంటున్నారు.
అన్నవరం