తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు కిటకిటలాడారు. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తున్నారు. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో రహదారిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆర్టీసి బస్సులు సైతం బొబ్బర్లంక ప్రధాన రహదారిపై నిలిచిపోయాయి. దీంతో అక్కడి నుంచి స్వామి ఆలయానికి భక్తులు నడిచి వెళ్తున్నారు. ఆలయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. క్యూలైన్లన్నీ నిండిపోవడంతో ప్రదక్షిణలు చేసే భక్తులకు ఇక్కట్లు ఎక్కువైపోయాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోవటమే కాకుండా ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య ఎక్కువ కావడంతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెరిగిన రద్దీ
శ్రావణమాసం కావడంతో ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తూగో జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో క్యూలైన్లన్నీ నిండి అవస్థలు పడుతున్నారు.
భక్తుల అవస్థలు