ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవాల నిర్వహణకు పలువురు భక్తులు విరాళాలు అందించారు. విజయవాడకు చెందిన రావాడ చిరంజీవిరావు రూ. లక్ష విలువైన పట్టు వస్త్రాలు అందించారు. 22న జరిగే స్వామి వారి కల్యాణానికి పుష్పాలంకరణకు ప్రకృతి ఎవెన్యూస్ లిమిటెడ్ నుంచి రూ. 50 వేలు, గన్నవరంకు చెందిన గోవింద రెడ్డి రెండు కేజీల ముత్యాల తలంబ్రాలు అందించారు. దేవస్థానంలో స్వామి వారి సేవలు ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించేందుకు విశాఖపట్నంకు చెందిన దామిరెడ్డి జయ భారత్ రెడ్డి, పద్మజలు రూ. 2 లక్షలు విలువైన పరికరాలు ఇచ్చారు.
అన్నవరం సత్యదేవుని కల్యాణానికి కానుకలు - Gifts for Annavaram Satyanarayana Swamy Kalyanotsava
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలకు భక్తులు కానుకలను అందజేశారు. లక్ష విలువైన పట్టు వస్త్రాలు, రెండు కేజీల ముత్యాల తలంబ్రాలతో పాటు స్వామి వారి సేవలు ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసే పరికరాలను అందజేశారు.
కల్యాణానికి కానుకలు