కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాగా శనివారం 8,404 మంది భక్తులు దర్శించుకోగా... ఆలయానికి రూ. 4.14 లక్షల ఆదాయం వచ్చింది. సాధారణ దర్శనానికి 5,200 మంది, ప్రత్యేక దర్శనానికి 3,204 మంది భక్తులు వచ్చారు. ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 1.60 లక్షల ఆదాయం, అన్నప్రసాద విరాళ ఆదాయం రూ.44,785 వేలు, సేవల ఆదాయం రూ.10,955 వేలు, వాహన రుసుములు ఆదాయం రూ.39,830 వేలు, లడ్డూల ఆదాయం రూ.1.29 లక్షలు, విరాళ ఆదాయం రూ. 29,262 వేల నగదు వచ్చినట్లు ఈవో తెలిపారు.
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శనివారం అధికంగా భక్తులు వచ్చారు. కాగా శనివారం ఒక్క రోజే 8,404 మంది భక్తులు వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.
శనివారం అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు